
Melody
Melodysmooth
పల్లవి:
చీకటంత మాయమే
నీ రాకతో ఆ చిరునవ్వుతో..!
అహా..
కలువలే విరిసెనే
నీ చూపుతో ఆ చేతి స్పర్శతో..!
అబ్బో..
అందమైన ఆకసం హర్షించెనే..!
నీ పలుకులతో చురకత్తి చూపులతో.!
పాలవెల్లే పులకరించెనే..
నీ నయన భాషణాలతో..
చరణం:1
అందమంత నీకుందని అష్టదిక్పాలకులు చెప్తూంటే..!
సొగసంతా నీది అని సురలు సైతం తెగ పొగుడుతూ పాడుతుంటే..!
మెరుపులన్నీ నిన్ను చూడ బయటికొచ్చెనె..!
ఘనమైన మబ్బులే నిన్ను పిలిచి పులకరించెనె.!
వరుణుడే దిగివచ్చి వర్షమాయనే..!
గాలి కూడా నిన్ను తాకటానికి గంతులేసెనే..!
హరివిల్లే కనుబొమలలో కలసిపోయెనే..!
"చీకటంత మాయమే నీ రాకతో ఆ చిరునవ్వుతో "
చరణం :2
కోహినూరే కొసరి కొసరి నీ మేను మెరుపునె అడిగెనె..
నీ కురుల అలజడిలో పుట్టినవే ఎగిరే కెరటాలే..
నీ కాటుక కళ్ళలాంటివే నిశిలోని తారకలు..
నీ చిరు హాసమే చంద్రునికి గొప్ప సహవాసమే..
కోయిల గానాలయినా నీ పలుకులకు చరణాలే..
నా గుండె చప్పుడులో దాగున్నవి నీ శ్వాస చిహ్నాలే..
"చీకటంత మాయమే నీ రాకతో ఆ చిరునవ్వుతో"